డిసెంబర్ 11న విశాల్ మెగా మార్ట్ ఐపీఓ

న్యూఢిల్లీ: రిటైల్‌‌ మార్ట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్ తన రూ. 8,000 కోట్ల ఐపీఓను డిసెంబర్ 11న పబ్లిక్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించనుంది. ఇది డిసెంబర్ 13న ముగుస్తుంది.  

యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ డిసెంబర్ 10న ఉంటుంది. ఈ ఐపీఓ పూర్తిగా ప్రమోటర్ సమయత్ సర్వీసెస్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​). ఈక్విటీ షేర్ల  తాజా ఇష్యూ లేదు.  ప్రస్తుతం, గురుగ్రామ్ ఆధారిత సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్ కంపెనీలో సమయత్ సర్వీసెస్​కు 96.55 శాతం వాటా ఉంది.