ఉద్యోగం కోసం ఓ కన్సల్టెన్సీ కంపెనీ ద్వారా లండన్ వెళ్లిన ఐటీఐ స్టూడెంట్‌కు జాబ్ రాలేదు. దీంతో తాను రెండు నెలలకే అక్కడి నుంచి తిరిగి రావాల్సి వచ్చింది. జాబ్ కోసం లక్షల డబ్బు కన్సల్టెన్సీకి చెల్లించాడు. మెదక్ కు చెందిన రవీందర్ వెల్డింగ్ లో ఐటీఐ డిప్లమా చేసి యూకేలో జాబ్ చేయాలనుకున్నాడు. అందుకు ఓవర్సీస్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్స్ కంపెనీకి జాబ్ ఇప్పించడానికి రూ.4లక్షలు అప్పు చేసి కట్టాడు. వాటితోపాటు అక్కడ ఉండేందుకు, ఫ్లైట్ ఖర్చులు రూ.2లక్షలు ఖర్చు అయ్యాయి. 2023 సెప్టెంబర్ లో వీసా తీసుకొని లండన్ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక అతనికి ఉద్యోగం ఇప్పించడంలో కన్సల్టెన్సీ కంపెనీ సహాయం చేయలే.. తనకు జాబ్ రాలే 2023 డిసెంబర్ 22న తిరిగి రవీందర్ ఇండియా రావాల్సి వచ్చింది.
తనకు జరిగిన నష్టానికి రవీందర్ ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపాడు. వాళ్లు స్పందించలేదు. దీంతో రవీందర్ కన్స్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించాడు. తాను ఇండియాకు తిరిగి వచ్చిన ఖర్చులుతోపాటు నష్టపరిహారం కూడా కన్సల్టెన్సీ నుంచి ఇప్పించాలని కోరాడు. మెదక్ వినియోగదారుల వివాదాల పరిష్కర కమిషన్ ఈ కేసు డీల్ చేసింది. సర్వీస్ ఫేయిల్ అయినందుకు రవీందర్ కు అతను ఇచ్చిన డబ్బుతోపాటు ఫ్లైట్ టికెట్స్ ఖర్చులు, ఇతర ఖర్చులు రూ.8లక్షలు, నష్టపరిహారంగా రూ.25వేలు ఇవ్వాలని కన్స్యూమర్ ఫోరం ఆదేశించింది.