మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్న ఎల్లమ్మ టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలీన వివాదం

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం వెల్లుల్ల ఎల్లమ్మ టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండోమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విలీనం వివాదం కొనసాగుతూనే ఉంది. మంగళవారం టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకునేందుకు ఎండోమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు లోపలికి వెళ్తుండగా వీడీసీ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ఏవో కాంతారెడ్డి టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్తుండగా అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండోమెంట్ ఆధీనంలో ఉందని, తమ విధులకు ఆటంకం కలిగించొద్దని సూచించారు. దీనిపై వీడీసీ సభ్యులు మాట్లాడుతూ తమకు కొంత టైం ఇస్తే విలీనం రద్దు ఉత్తర్వులు తీసుకొస్తామని చెప్పారు. దీంతో అధికారులు వెనుదిరిగారు.