స్టూడెంట్లను కరిచిన ఎలుకలు..కరీంనగర్‌‌ జిల్లా సైదాపుర్‌‌ బీసీ గురుకులంలో ఘటన

స్టూడెంట్లను కరిచిన ఎలుకలు..కరీంనగర్‌‌ జిల్లా సైదాపుర్‌‌ బీసీ గురుకులంలో ఘటన

హుజూరాబాద్‌‌, వెలుగు : హుజూరాబాద్‌‌ పట్టణంలోని సైదాపూర్‌‌ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులంలో ఉంటున్న నలుగురు స్టూడెంట్లను గురువారం రాత్రి ఎలుకలు కరిచాయి. శుక్రవారం ఉదయం స్కూల్‌‌కు వచ్చిన ప్రిన్సిపాల్‌‌ రాణి విషయం తెలుసుకొని స్టూడెంట్లను హాస్పిటల్‌‌కు తరలించారు. వీరితో పాటు అదే గదిలో ఉంటున్న స్టూడెంట్లందరికీ టెస్టులు చేయించినట్లు ప్రిన్సిపాల్‌‌ తెలిపారు. కాగా, స్కూల్‌‌ సమీపంలోనే రైస్‌‌ మిల్లులు ఉండడంతో ఎలుకల బెడద ఎక్కువైందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.