రోడ్డు కోసం ఓ గ్రామస్థులు రోడ్డెక్కారు. తమ గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏండ్లుగా రోడ్డు కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో విసిగిపోయిన సయ్యద్ పల్లి గ్రామస్థులు షాద్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నిరసనకారులు వెనక్కి తగ్గేందుకు నిరాకరించారు. పోలీసులు వారిని పక్కకు లాగే ప్రయత్నం చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 3వేల మంది ఓటర్లున్నా తమ ఊరికి ఇప్పటికీ బీటీ రోడ్డు వేయడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేయకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
రోడ్డు కోసం రోడ్డెక్కిన్రు
- రంగారెడ్డి
- January 28, 2023
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.