కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలపొద్దు 

కొత్తపల్లి, వెలుగు : కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామాన్ని కరీంనగర్​ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలపొద్దని కోరుతూ గ్రామస్తులు, ఉపాధి కూలీలు సోమవారం చింతకుంట బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా కార్పొరేషన్​లో విలీనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్పొరేషన్​లో విలీనం చేస్తే సుమారు వెయ్యి మంది ఉపాధి హామీ కార్మికులు పనులుకోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

రియల్ ఎస్టేట్ పెరిగి సామాన్యులు భూములు కొనలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో లీడర్లు భూక్యా తిరుపతినాయక్, రేణయ్య, రేణిగుంట రాజు, శంకరయ్య, సోమిరెడ్డి లచ్చిరెడ్డి, కరుణాకర్, నరేందర్, తిరుపతిగౌడ్, వాజిద్, 300 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.