చేర్యాల, వెలుగు: మండలంలోని వేచరేణి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డికి వేచరేణి గ్రామస్తులు, కాంగ్రెస్నాయకులు వినతిపత్రం అందజేశారు. గురువారం చేర్యాలలోని కొమ్మూరి నివాసంలో ఆయనను కలిసి త్వరగా టెండర్లను పిలిచి వేగంగా పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో టెండర్లు పూర్తయినప్పటికీ పనులు చేయలేదని, వైకుంఠధామం, డంప్ యార్డ్లు వాగు అవతలి ఒడ్డున ఉండడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు.
చనిపోయిన వారిని వైకుంఠధామానికి తరలించాలంటే వాగు దాటలేక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విన్నవించారు. వ్యవసాయ పనుల కోసం, చేర్యాల మండల కేంద్రానికి వెళ్లడం కోసం 8 కిలోమీటర్లు తిరగాల్సి వస్తోందని వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ము రవి, కొమురవెల్లి టెంపుల్ చైర్మన్లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్‌గౌడ్, కాంగ్రెస్నాయకులు మాదాసు బాలకృష్ణ, సత్యం, ఆజం, కనకయ్య, నర్సిరెడ్డి, చంద్రయ్య ఉన్నారు.