పది అడుగుల కొండచిలువ హతం

జైపూర్(భీమారం)/కుభీర్, వెలుగు: వేర్వేరు చోట్ల రెండు భారీ కొండచిలువలను గ్రామస్తులు హతమార్చారు. భీమారం మండలం పోటువాడలో ఓ రైతు పశువుల పాక పక్కన మేత కోసం నిల్వ ఉంచిన గడ్డి వాములో 10  అడుగుల కొండచిలువను గుర్తించాడు. విషయం గ్రామస్తులకు చెప్పడంతో అంతాకలిసి కొట్టిచంపారు.  
 

కుభీర్​ మండలంలో..

మండలంలోని దార్ కుభీర్ గ్రామంలో భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. గ్రామానికి చెందిన రైతు జరుగు పోతన్న సోయా పంటకు శుక్రవారం పురుగుల మందు స్ప్రే చేస్తుండగా భారీ కొండచిలువ కనిపించింది. దీంతో భయానికి గురైన రైతు కేకలు వేయడంతో పక్క చేనులో ఉన్న కొందరు రైతులు అక్కడికి చేరుకొని కొండచిలువను కర్రలతో కొట్టి చంపేశారు. కొండచిలువ 6 అడుగుల పొడువు ఉందని తెలిపారు.