కాగజ్ నగర్, వెలుగు: కోట్ల రూపాయలు పెట్టి అందెవెల్లి పెద్దవాగు మీద బ్రిడ్జి రిపేర్లు చేపట్టినా ఇప్పుడు ఆ బ్రిడ్జి మీద కేవలం బైక్ మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వానలకు బ్రిడ్జి చివర అప్రోచ్ రోడ్డుకు వేసిన మొరం కోతకు గురైంది.
దీంతో పోలీసులు కేవలం బైక్లను మాత్రమే దాటేందుకు అనుమతిస్తున్నారు. ఇతర వాహనాలను తిప్పి పంపిస్తున్నారు. మొరం, కంకర ఎక్కువ పోసి ఆటోలు, ఇతర వాహనాలకు అనుమతించాలని ప్రజలు కోరుతున్నారు.