మహిళపై చిరుతపులి దాడి.. భయాందోళనలో గ్రామస్తులు

అదిలాబాద్ జిల్లా బజార్ హథ్నూర్  మండలం డెడ్రా గ్రామంలో చిరుత పులి దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన అర్కా భీమాబాయి బహిర్భూమికి వెళ్లిన సమయంలో చిరుతపులి దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. 

వెంటనే ఆమెను ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. డిప్యూటీ ఎఫ్ ఆర్ వో ప్రవీణ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. చిరుతపులి దాడితో గ్రామ ప్రజలు భయాందోళనల్లో గడుపుతున్నారు.