త్వరలో 5జీ సేవలు..ప్రకటించిన వొడాఫోన్​ ఐడియా

హైదరాబాద్​, వెలుగు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని వొడాఫోన్​ఐడియా (వీఐ) ప్రకటించింది. ఇదివరకే కొన్ని నగరాల్లో 5జీ సేవలను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టామని కంపెనీ క్లస్టర్ బిజినెస్ హెడ్ (ఏపీ, తెలంగాణ, కర్ణాటక) ఆనంద్ దానీ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నెట్​వర్క్​ విస్తరణ కోసం రూ.4,122 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. 

‘‘తెలంగాణలో మాకు ఐదు వేలకుపైగా టవర్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మాకు కోటి మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. యావరేజ్​రెవెన్యూ పర్​ యూజర్​(ఆర్పూ) రూ.200 వరకు ఉంది”అని వివరించారు.