ఆదిలాబాద్, వెలుగు : డైట్ కాలేజీల్లో ప్రవేశాలకు డీసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గురువారం ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కాలేజీలో అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ప్రక్రియలో మొదటి రోజు 550 మంది అభ్యర్థులకు గానూ 436 మంది హాజరైనట్లు
ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈనెల 6 వరకు వెరిఫికేషన్ ఉంటుందన్నారు. డైట్ కాలేజీ సూపరింటెండెంట్ భోజన్న, లెక్చరర్లు స్వర్ణకుమారి, ఉద్యోగులు వేణు, సతీశ్తదితరులు పాల్గొన్నారు.