గంగపుత్ర సంఘం టౌన్ ప్రెసిడెంట్ గా చక్రపాణి

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నికున్నారు.  పట్టణంలోని తిలక్ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా వంగళ చక్రపాణి, కార్యదర్శులుగా మాదరబోయిన మల్లేశ్, దామెర విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిటీ చైర్మన్ దామెర సదానందం తెలిపారు. 

ఈ సందర్భంగా అధ్యక్షుడు చక్రపాణి మాట్లాడుతూ.. గంగపుత్ర సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. నూతన గంగపుత్ర సంఘం భవనం నిర్మాణం పూర్తిచేసేందుకు తోడ్పాడుతామన్నారు. కార్యక్రమంలో సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు డోలి సుధాకర్, చీఫ్ అడ్వైజర్ బాసబోయిన పోతరాజు తదితరులు పాల్గొన్నారు.