ఊరికి దూరంగా వైకుంఠధామం

మెదక్ పట్టణ శివారులో  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్లతో చేపట్టిన వైకుంఠ ధామం అలంకారప్రాయంగా ఉంది.  ఏండ్లు గడుస్తున్నా  పనులు పూర్తి కావడం లేదు. దీంతో అది నిరుపయోగంగా మారింది.  పైగా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో  దీని నిర్మాణం చేపట్టారు.   రోడ్డు కంటే చాలా లోతులో నిర్మించడం వల్ల    వర్షం పడితే జలమయం అవుతోంది.

పట్టణానికి   దూరంగా  ఉండడం తిప్పలు తప్పేలా లేవు.    పనులు పూర్తి కాకపోవడం, అది సరైన స్థలం కాకపోవడం, శ్మశానానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు.  రెండు కోట్ల నిధులు వెచ్చించినా..  అసంపూర్తిగా మిగలడం  గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది.  - మెదక్, వెలుగు