పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ 

నేరడిగొండ, వెలుగు: పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందించాలని ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ అన్నారు. నేరడిగొండ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఆయన సందర్శించారు. పోలీసులు డీఎస్పీకి గౌరవ వందనం చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాల్లో పటిష్టంగా పని చేయాలన్నారు.

నేషనల్ హైవే పై నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. అనంతరం స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ భీమేశ్, నేరడిగొండ ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.