నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో యూటీఐ ఫైనాన్షియల్ సెంటర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్​, వెలుగు:  యూటీఐ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ (యూటీఐ ఏఎంసీ) తెలంగాణలోని నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో తమ కొత్త ఫైనాన్షియల్​ సెంటర్​ను ప్రారంభించింది. ఈ నెల కంపెనీ తూర్పు, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో 19 కొత్త యూటీఐ ఫైనాన్షియల్ సెంటర్లను (యూఎఫ్‌‌‌‌‌‌‌‌సీ) ఏర్పాటు చేసినట్లు  ప్రకటించింది.

 అందరికీ ఆర్థిక ఫలాలు అందేలా చూడటం,  చిన్న ప్రాంతాల్లోని ఇన్వెస్టర్లను కూడా మ్యుచువల్ ఫండ్ పెట్టుబడుల ద్వారా ఆర్థిక వ్యవస్థ ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు యూటీఐ తెలిపింది. దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.