అకాల వర్షం..నేలకొరిగిన పంట..అన్నదాతకు తీరని నష్టం

బెల్లంపల్లి రూరల్/దండేపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, దండేపల్లి మండలాల్లో శుక్రవారం ఉదయం కురిసిన అకాల వర్షంతో పంటలన్నీ తడిసిపోయి నేలకొరిగాయి. చేతికి వచ్చిన వరి పంట నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పత్తి పంట సైతం తడిసి ముద్దయ్యింది.  ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికచ్చే సమయంలో అకాల వర్షం రైతుకు నష్టాన్ని మిగిల్చింది.

ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. దండే పల్లి మండలంలో 260 ఎకరాల్లో వరి నేలకొరిగి నష్టం వాటిళ్లిందని ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు ఏవో అంజిత్ కుమార్ తెలిపారు. ఉన్నాతధికారులకు నివేదికలు పంపించామని చెప్పారు.