కొత్త గైడ్‌‌‌‌లైన్స్ ప్రకారం, కపుల్స్ ఓయో హోటల్స్‌‌‌‌లో రూమ్ తీసుకోవాలంటే..

  • పెండ్లికాని జంటలకు రూమ్‌‌లివ్వం: ఓయో

న్యూఢిల్లీ: పెళ్లికాని జంటలు ఇక నుంచి ఓయో రూమ్‌‌‌‌లలో దిగడం కుదరదు. కంపెనీ కొత్త చెకిన్ పాలసీని  ప్రకటించింది. మీరూట్‌‌‌‌లో  మొద టగా అమలు చేస్తోంది. కొత్త గైడ్‌‌‌‌లైన్స్ ప్రకారం, కపుల్స్  ఓయో హోటల్స్‌‌‌‌లో రూమ్ తీసుకోవాలంటే  మొదటగా వారి మధ్య సంబంధాన్ని నిరూపించే ప్రూఫ్‌‌‌‌ చూపించాల్సి ఉంటుంది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రూమ్‌‌‌‌ బుక్ చేసుకున్నా, రిలేషన్‌‌‌‌షిప్ ప్రూఫ్ అవసరం. అంతేకాకుండా లోకల్ సాంప్రదాయాలకు అనుగుణంగా  కపుల్స్ బుకింగ్స్‌‌‌‌ను  పార్టనర్‌‌‌‌‌‌‌‌ హోటల్స్‌‌‌‌ క్యాన్సిల్ చేయొచ్చని ఓయో పేర్కొంది. ఈ ఏడాది మిగిలిన సిటీలలో కూడా ఈ పాలసీ అమల్లోకి రానుంది.

పెళ్లికాని జంటలు ఓయో రూమ్‌‌‌‌లలో దిగకుండా అడ్డుకోవాలని  ఫిర్యాదులు వస్తున్నాయని కంపెనీ పేర్కొంది. సురక్షితమైన, బాధ్యతయుతమైన హాస్పిటాలిటీ సర్వీస్‌‌‌‌లను అందించడానికి కట్టుబడి ఉన్నామని, ప్రతీ ఒక్కరి ప్రీడమ్‌‌‌‌ను గౌరవిస్తూనే,  సివిల్ సొసైటీ గ్రూప్‌‌‌‌లు, లా ఎన్‌‌‌‌పోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ సంస్థలతో కలిసి పనిచేస్తామని ఓయో నార్త్‌‌‌‌ ఇండియా హెడ్‌‌‌‌ పవాస్‌‌‌‌ శర్మ అన్నారు. బ్రాండ్ ఇమేజ్‌‌‌‌ను మార్చుకోవడానికి ఓయో చర్యలు చేపడుతోంది. కుటుంబాలు, విద్యార్ధులు, బిజినెస్‌‌‌‌లు, సోలో ట్రావెలర్లు సేఫ్‌‌‌‌గా ఫీలవ్వడానికి ఈ పాలసీ తెచ్చింది.