శనిగకుంట మత్తడి ధ్వంసం .... మరమ్మత్తులు చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశం

మంచిర్యాల జిల్లా చెన్నూరు లో  శనిగకుంట మత్తడిని  గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేశారు.  దీంతో నిండు కుండలా నీటితో నిల్వ ఉన్న చెరువు ఖాళీ అవుతుంది.  అధికారులు వెంటనే మత్తడికి మరమ్మత్తులు చేసి.. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి మత్తడికి మరమ్మత్తులు చేయాలని ఇరిగేషన్​ అధికారులను ఆదేశించారు.  ఇసుక బస్తాలతో తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి నీరు వృధా కాకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. 

also read : మందమర్రిలో సింగరేణి కార్మికుడు మృతి.. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం. . .

చెన్నూరు శనగకుంట మత్తడి ధ్వంసంపై ఇరిగేషన్​ అధికారులు స్పందించారు.  గుర్తుతెలియని వ్యక్తులు డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ పెట్టి మత్తడిని ధ్వంసం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెరువునే ఆధారంగా చేసుకొని బతుకుతున్న జాలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.