కోల్బెల్ట్/నస్పూర్ : రామకృష్ణాపూర్ పట్టణంలోని యూనియన్ బ్యాంక్, దక్కన్ గ్రామీణ బ్యాంక్, ఎస్ బీఐ బ్యాంకులను పట్టణ ఎస్ఐ జి.రాజశేఖర్గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బ్యాకుల వద్ద అమాయక బాధితుల నుంచి డబ్బు దొంగతనాలు, ఏటీఎం మోసాలు జరుకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకుల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు అత్యవసర పరిస్థితుల్లో అలారం సిస్టం పనితీరును పరిశీలించారు.
సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకుల వద్ద స్థానిక పోలీసులు సోదాలు చేశారు. అనుమానాస్పదంగా ఉన్నవారిని తనిఖీ చేశారు. బ్యాంకు సిబ్బందితో మాట్లాడుతూ బ్యాంకుల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వెంటనే 100కు గానీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ సుగుణాకర్, బ్లూ కోల్ట్ సిబ్బంది పాల్గొన్నారు.