జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి

  • నిరుద్యోగుల నిరసన

సిద్దిపేట టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సిద్దిపేట నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయ‌‌కుడు మోతీలాల్ నాయ‌‌క్ చేస్తున్న ఆమ‌‌ర‌‌ణ నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు.

డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని, గ్రూప్ పోస్టులు పెంచాలని నినాదాలు చేశారు. నిరుద్యోగ సమస్యలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తక్షణమే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.