ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని లిటిల్‌ఫ్లవర్ హైస్కూల్లో మంగళవారం అండర్ -14, 17 స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఎస్జీఎఫ్ సెక్రటరీ ఫణిరాజ్, మాజీ వైస్‌ఎంపీపీ వజీర్ సుల్తాన్ పోటీలను ప్రారంభించారు.
పోటీల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 180 మంది విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెస్ డెవలప్మెంట్ చైర్మన్ ఈగ కనుకయ్య, మెంబర్ తిరుపతిరెడ్డి, స్కూల్ చైర్మన్ దామెర్ల రమాసిద్దయ్య పాల్గొన్నారు.