అల్ట్రాటెక్‌‌‌‌ చేతికి ఇండియా సిమెంట్స్

న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్‌‌‌‌‌‌‌లోని  ప్రమోటర్ల వాటా  32.72 శాతాన్ని అల్ట్రాటెక్‌‌‌‌ సిమెంట్స్‌‌‌‌ కొనుగోలు చేసింది. డీల్ పూర్తవ్వడంతో ఇండియా సిమెంట్స్‌‌‌‌ బోర్డు నుంచి  ఎన్‌‌‌‌  శ్రీనివాసన్‌‌‌‌, రూపా గురునాథ్‌‌‌‌, చిత్ర శ్రీనివాసన్‌‌‌‌, వీఎం మోహన్‌‌‌‌ వైదొలిగారు. ఈ కంపెనీకి చెందిన 10.13 కోట్ల షేర్లను రూ.3,945 కోట్లకు అల్ట్రాటెక్‌‌‌‌ కొనుగోలు చేసింది. దీంతో పాటు ఇప్పటికే ఉన్న 23 శాతం వాటాను కలుపుకుంటే   కంపెనీలో  వాటా 55.49 శాతానికి చేరుతుంది. అల్ట్రాటెక్‌‌‌‌కు ఇండియా సిమెంట్స్‌‌‌‌ సబ్సిడరీగా మారింది.