ముళ్ల పందిని వేటాడిన ఇద్దరి రిమాండ్

రామాయంపేట, వెలుగు: అటవీ ప్రాంతంలో ముళ్ల పందిని పట్టుకుని రామాయంపేటకు తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఫారెస్ట్​ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుత్​బుద్దీన్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం..  భగీర్తిపల్లికి చెందిన శ్రీహరి, వెల్దుర్తికి చెందిన సంతోష్  శనివారం అటవీ ప్రాంతం నుంచి ముళ్ల పందిని పట్టుకుని రామాయంపేటకు తరలిస్తున్నారు. ఈక్రమంలో వారిని పట్టుకుని ముళ్ల పంది తో పాటు బైక్ ను స్వాధీనం చేసుకుని మెదక్ కోర్టులో హాజరు పర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించిందినట్లు ఆయన చెప్పారు.