గంజాయి సాగుచేసిన ఇద్దరికి జైలు శిక్ష

జైనూర్, వెలుగు: కూరగాయలు పేరిట గంజాయి సాగు చేసి అమ్మిన ఇద్దరికి మూడేండ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల  చొప్పున జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ అసిఫాబాద్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ మంగళవారం తీర్పునిచ్చారు. జైనూర్ సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ పోలీస్ స్టేషన్​ సిబ్బంది ఈ ఏడాది జులై 28న  పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా లింగాపూర్ మండలం వంజరిగూడ గ్రామనికి చెందిన మావలే గోవింద్, దొండ్రం అనే వ్యక్తులు రెండు సంచులతో సంచరిస్తుండగా అనుమానంతో వారిని తనిఖీ చేయగా సంచుల్లో గంజాయి లభించింది.

విచారించగా గ్రామంలో కూరగాయల తోటలో గంజాయి సాగు చేస్తూ అమ్ముతున్నట్లు ఒప్పుకు న్నారు. అప్పటి సీఐ హనూక్ ఈ ఇద్దరిపై కేసు బుక్ చేసి కోర్టులో హాజరుపరచగా పీపీ జగన్​మోహన్ ​రావు సాక్షులను కోర్టులో హాజరుపరచారు. నేరం రుజువు కావడంతో నిందితులకు మూడేండ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల చొప్పున జరిమాన విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు సీఐ తెలిపారు.