వేర్వేరు చోట్ల ఇద్దరి హత్య

  •     మంచిర్యాల జిల్లాలో కొడుకు మీద కోపంతో తండ్రి హత్య
  •     గుర్రంపేటలో మహిళను..

చెన్నూర్, వెలుగు :  ఓ వ్యక్తి.. కొడుకు మీద ఉన్న కోపంతో అతడి తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌‌‌‌‌‌‌‌ మండలంలోని ముత్తరావుపల్లిలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన పైడిపెల్లి రాజశేఖర్‌‌‌‌‌‌‌‌, జాడి భూమయ్య భార్య సౌందర్య మధ్య వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరు ఏడు నెలల కింద గ్రామం నుంచి వెళ్లిపోయారు. దీంతో భూమయ్య తన భార్య కనిపించడం లేదని చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు రాజశేఖర్‌‌‌‌‌‌‌‌, సౌందర్యను పిలిపించి కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. అయినప్పటికీ సౌందర్య రాజశేఖర్‌‌‌‌‌‌‌‌తోనే ఉంటానని చెప్పింది. తర్వాత ఇద్దరూ కలిసి మరో చోటుకు వెళ్లి సహజీవనం చేస్తున్నారు. అయితే తన భార్యను తీసుకెళ్లాడని భూమయ్య రాజశేఖర్‌‌‌‌‌‌‌‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ తండ్రి మల్లయ్య (50) శనివారం గ్రామ శివారులోకి వెళ్లగా అప్పటికే అక్కడ ఉన్న భూమయ్య మల్లయ్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

గుర్రంపేటలో మహిళ హత్య

వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌ (రామప్ప), వెలుగు : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌ మండల పరిధిలోని గుర్రంపేటలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సకినాల సరస్వతి (35) భర్త గతంలోనే చనిపోవడంతో మేకలు కాసుకుంటూ జీవిస్తోంది. కూతురికి పెండ్లి జరుగగా, కొడుకు సరస్వతి తల్లి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. శనివారం ఉదయం మేకల కొట్టం వద్దకు వచ్చిన స్థానికులకు సరస్వతి శవమై కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ములుగు సీఐ శంకర్‌‌‌‌‌‌‌‌, వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌ ఎస్సై సతీశ్‌‌‌‌‌‌‌‌ ఘటనాస్థలాన్ని సందర్శించారు. డాగ్‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌, క్లూస్‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌‌‌‌‌‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మహిళ దుస్తులు చిందరవందరగా ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతోకేసు నమోదు చేసినట్లు సీఐ శంకర్ తెలిపారు.