బైక్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..ఇద్దరు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.   జైనథ్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం దగ్గర ఆర్బీసీ బస్సు  ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.   మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉట్నూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు  మహారాష్ట్రలోని  చంద్రాపూర్ కు వెళ్తుండగా..  బైక్ ను డీ కొట్టగా ఈ ప్రమాదం జరిగింది. 

 ప్రమాద ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడ్డ బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.  కేసు నమోదు చేసుకున్న  దర్యాప్తు చేస్తున్నారు.  మృతుల వివరాలను సేకరిస్తున్నారు.