బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ఓ మైనర్తో పాటు, మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రవికుమార్ తెలిపారు. బెల్లంపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్ఘలోద్దీన్ ఆధ్వర్యంలో బట్వాన్ పల్లి సమీపంలో ఆదివారం పెట్రోలింగ్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉన్న అదే గ్రామానికి చెందిన బొగ్గుల సంపత్, ఓ మైనర్ను తనిఖీ చేశారు. వారి వద్ద 90 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. గంజాయి అమ్మినా, కొన్నా ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు.