సింగరేణిలో అధికారుల బదిలీలు

  • శ్రీరాంపూర్​ ఏరియా కొత్త జీఎంగా సూర్యనారాయణ

కోల్​బెల్ట్, వెలుగు :​ సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాలకు చెందిన పలువురు అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్​ఏరియా కొత్త జీఎంగా ఎల్వీ సూర్యనారాయణను నియమించింది. ఆయన ప్రస్తుతం రామగుండం-2 ఏరియా జీఎంగా పనిచేన్నారు. భూపాలపల్లి ఏరియా జీఎం ఎస్​డీ హబీబ్​ హుస్సేన్​ను కార్పొరేట్ ​హెచ్ఆర్​డీ జీఎంగా, కొత్తగూడెం రీజియన్​క్వాలిటీ జీఎం సుశాంత్ ​సాహను బెల్లంపల్లి రీజియన్ ​క్వాలిటీ జీఎంగా, కార్పొరేట్​ఎస్టేట్ ​జీఎం బి.వెంకటయ్యను రామగుండం-2 ఏరియా జీఎంగా బదిలీ చేశారు.

నైనీ ఏరియా అడిషనల్​జీఎంగా పనిచేస్తున్న సుజయ్​ మజుమేందర్​కు ప్రమోషన్​ కల్పిస్తూ అదే ఏరియా ఓఎస్డీగా(జీఎం),  మందమర్రి ఏరియా ఏస్వోటుజీఎం ఎ.రాజేశ్వర్​రావుకు ప్రమోషన్​కల్పిస్తూ భూపాలపల్లి ఏరియా జీఎంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  రామగుండం-3 ఏరియా ఓసీపీ1 పీవోగా పనిచేస్తున్న అడిషనల్​ జీఎం ఎన్.రాధకృష్ణను కార్పొరేట్​ఎస్టేట్​జీఎంగా సింగరేణి యాజమాన్యం నియమించింది.  కార్పొరేట్​ క్వాలిటీ జీఎం ఎ.రవికుమార్​కు కొత్తగూడెం రీజియన్ ​క్వాలిటీ జీఎంగా పూర్తి అదనపు బాధ్యతలు కల్పించింది.

ఈనెల 30న ఎల్లందు జీఎం జాన్​అనంద్ పదవీ విరమణ పొందనున్నారు. ఆయన స్థానంలో వీసం కృష్ణయ్యను నియమించనున్నట్లు పేర్కొంది. మరోవైపు పర్సనల్​ విభాగానికి చెందిన కార్పొరేట్​ సెక్యూరిటీ జీఎం కె.శ్రీనివాస్ ​రావును వెల్ఫేర్ ​అండ్​ ఆర్​సీ జీఎంగా, కార్పొరేట్ ​హెచ్ఆర్​డీ ఏజీఎం చంద లక్ష్మీనారాయణను కార్పొరేట్​సెక్యూరిటీ జీఎంగా బదిలీ చేసింది.