మునిపల్లి మండలంలో పాఠశాలలను సందర్శించిన ట్రైనీ కలెక్టర్

రాయికోడ్(మునిపల్లి ), వెలుగు : మునిపల్లి మండల పరిధిలోని బుదేరా జడ్పీహెచ్ ఎస్, ప్రైమరీ స్కూల్​తోపాటు లింగంపల్లి బాలుర గురుకుల స్కూల్, కళాశాలను విద్యాధికారి వెంకటేశ్వర్లతో కలిసి బుధవారం ట్రైనీ కలెక్టర్ మనోజ్ కుమార్ పరిశీలించారు. లింగంపల్లి గురుకుల పాఠశాల, కళాశాల తరగతి గదులోకి వెళ్లి  విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. 

సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను ఆయన అభినందించారు.  అనంతరం వంటశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు  నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపాల్ సురభి చైతన్యకు సూచించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వారి వెంట ఎంఈవో దశరథ్, హెచ్ఎం లు ఉన్నారు.