గణేష్ నిమజ్జనంలో విషాదం!

అదిలాబాద్ జిల్లా : గణేష్ శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది. బజార్ హత్నూర్ మండలం వర్తమున్నూర్ గ్రామంలో గణనాథుని నిమజ్జనానికి పిప్పరి గ్రామంలోని కుంట చెరువుకు వెళ్లారు. వినాయకుడికి వీడ్కోలు పలిగే సందర్భంలో గ్రామానికి చెందిన ఆరెల్లి రాకేష్ (28) కుంటలో గల్లంతైయ్యాడు. భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. రాకేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాలి.