వరిధాన్యంపై కవర్ కప్పుతుండగా.. తాత, మనవడిపై పిడుగు పడింది

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. వర్షం కురుస్తుండడంతో వరిధాన్యంపై కవర్ కప్పేందుకు వెళ్లిన తాతా, మనవడు పిడుగుపాటుతో మృతి చెందారు. ఈ ఘటన పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లిలో జరిగింది. పిడుగుపాటుకు తాత పాల్వంచ శ్రీరాములు, మనవడు విశాల్ స్పాట్ లోనే చనిపోయారు. తాతా, మనవడు ఒకేసారి చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

మరోవైపు రాష్ట్రానికి ఇవాళ, రేపుభారీ వర్షసూచన చేసింది వాతావరణశాఖ. రేపు హైదరాబాద్ లో భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఉపరితలఆవర్తనం కారణంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని అలెర్ట్ ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరింపజేసింది. రేపు ఎలక్షన్స్ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది జీహెచ్ఎంసీ.