అసిఫాబాద్‌‌‌‌ జిల్లాలో విషాదం.. ఇంట్లో గొడవలతో ఇద్దరు సూసైడ్‌‌‌‌

   పెళ్లయిన నాలుగు నెలలకే ఉరేసుకున్న యువకుడు
    దహెగాం మండలంలో వాగులో దూకి మరొకరు

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుమ్రంభీం అసిఫాబాద్‌‌‌‌ జిల్లా చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్‌‌‌‌కు చెందిన సుజయ్‌‌‌‌ బిశ్వాస్ (23 ) ఎలక్ట్రీషియన్‌‌‌‌గా పనిచేయడంతో పాటు డీజే నడుపుతున్నాడు. సుజయ్‌‌‌‌కి మహారాష్ట్రలోని చంద్రపూర్‌‌‌‌కు చెందిన నుపూర్‌‌‌‌ను నాలుగు నెలల కింద ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి బాలాజీ అనుకోడ పాల్వాయినగర్‌‌‌‌లో అద్దెకు ఉంటున్నారు. శనివారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సుజయ్‌‌‌‌ రాత్రి ఉరి వేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత గమనించిన భార్య నుపూర్‌‌‌‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు సుజయ్‌‌‌‌ని సిర్పూర్‌‌‌‌ టీ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు సుజయ్‌‌‌‌ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడి మామ కృష్ణో హీరా ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై యాదవ్‌‌‌‌ తెలిపారు.


వాగులో దూకి వ్యక్తి...

దహెగాం, వెలుగు : ఇంట్లో గొడవపడిన ఓ వ్యక్తి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దహెగాం మండలంలోని ఇట్యాల గ్రామానికి చెందిన కొట్రంగి సంతోష్ (35) ఇంట్లో శనివారం సాయంత్రం గొడవ జరిగింది. దీంతో రాత్రి 9.30 గంటల టైంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సంతోష్‌‌‌‌ సమీపంలోని బొక్కివాగులో దూకాడు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిగి వాగులో గాలించగా ఆదివారం మధ్యాహ్నం సంతోష్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీ దొరికింది. భార్య భూదేవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.