దుబ్బాక, వెలుగు: మెదక్కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నీలం మధుకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ఎంపీగా నీలం మధు గెలిస్తేనే ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలు తీరుతాయని, బీజేపీ, బీఆర్ఎస్అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి ఆమడ దూరంలో ఉంటుందన్నారు. ఆగస్ట్15లోగా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్అభ్యర్థి గెలిస్తేనే దుబ్బాక ప్రాంతం సుభిక్షింగా ఉంటుందన్నారు. ఎంపీగా పదేళ్లు పని చేసిన కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నియోజకవర్గానికి ఒక్క పైసా తీసుకరాలేదన్నారు. మూడేళ్లుగా ఎమ్మెల్యేగా పని చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాకకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, నాయకుడు మోహన్ రెడ్డి పాల్గొన్నారు.