నాగారాజుపై దాడికి కాంగ్రెస్ కు సంబంధం లేదు : చౌదరి సుప్రభాతరావు

రామాయంపేట, వెలుగు: రామాయంపేటకు చెందిన బీఆర్ఎస్ లీడర్ నాగరాజుపై జరిగిన దాడితో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదని టీపీసీసీ నాయకుడు చౌదరి సుప్రభాతరావు​  అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం 4 వ వార్డు కౌన్సిలర్ పై  కేవలం ఆర్థిక విభేదాల వల్ల గణేశ్ అనే వ్యక్తి  దాడి చేశారన్నారు. దీనికి కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు ఆపాదించడం సరికాదన్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృత్తం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రమేశ్ రెడ్డి, చింతల స్వామి తదితరులు ఉన్నారు.