గ్రామీణ మహోత్సవ్‌‌ నిర్వహించిన టొయోటా

హైదరాబాద్​, వెలుగు:  ఆటో మొబైల్​ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటర్, తెలంగాణలోని తన డీలర్ల సహకారంతో “తెలంగాణ గ్రామీణ మహోత్సవం”ను ఈ నెల 13 నుంచి 15 వరకు నిర్వహించింది. హర్ష టొయోటా , కాకతీయ టొయోటా , మోడీ టొయోటా  ఫార్చ్యూన్ టొయోటా నిర్వహించిన ఈ కార్యక్రమం మహబూబ్‌‌నగర్, మహూబాబాద్, జనగాం  చేవెళ్లలో జరిగింది. 

సర్వీస్, యూజ్డ్ కార్ సొల్యూషన్స్ (కార్ ఎక్స్‌‌ఛేంజ్ ఆఫర్‌‌లు)తోపాటు రూ. 10వేల వరకు ప్రత్యేక స్పాట్ బుకింగ్ ప్రయోజనాలను అందించామని కంపెనీ తెలిపింది.  అర్బన్ క్రూయిజర్ టైజర్, గ్లాంజా, హైరెడర్​, రూమియన్​, ఇన్నోవా క్రిస్టాపై రూ.లక్షకుపైగా విలువైన ప్రయోజనాలు అందించామని పేర్కొంది.