US Probe Effect: అదానీతో వ్యాపారం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ

బిలియనీర్ గౌతమ్ అదానీ మరో షాక్.. అమెరికా విచారణ క్రమంలో ఫారిన్ కంపెనీలు ఒక్కొక్కటి అదానీ గ్రూప్ తో  తమ వ్యాపార బంధాలు తెంచుకుంటున్నాయి. ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ కంపెనీలు టోటల్ ఎనర్జీస్ లిమిటెడ్.. అదానీ గ్రూప్ తో బిజెనెస్ ను రద్దు చేసుకుంది. అమెరికా విచారణకు సంబంధించి తమకు సమాచారం లేదని.. దీంతో వ్యాపారం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు ఎక్స్ పోజర్లను తగ్గించారు ఫలితం గా అదానీ డాలర్ బ్రాండ్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.   

మరోవైపు ఇండియాలో అదానీ గ్రూప్ పై అమెరికా విచారణ రాజకీయంగా దుమారం రేపుతోంది. పార్లమెంటులో చర్చకు పెట్టాలని అటు రాజ్యసభ, ఇటు లోక్ సభలో పట్టుబట్టారు ప్రతిపక్ష సభ్యులు. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. 

సోమవారం టోటల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ ప్రకటనతో అదానీ గ్రీన్ ఎనర్జీ భారీ నష్టాలను చవిచూసింది. స్టాక్ ట్రేడింగ్ చివరి నిమిషంలో అదానీ గ్రీన్ ఎనర్జీ భారీగా నష్ట పోయింది. ట్రేడింగ్ ముగిసే సమయంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు దారుణంగా పడిపోయాయి. దాదాపు 11.36 శాతం తగ్గడంతో  రూ. 932.90 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 

ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ అదానీ గ్రూప్ లో దాదాపు 33లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.. అమెరికా విచారణ విషయం తెలియగానే వ్యాపారం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.