800 బిలియన్ డాలర్లకు ఎగుమతులు: గోయెల్‌‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి మొత్తం ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను దాటుతాయని కామర్స్ మినిస్టర్ పియూష్ గోయెల్ అన్నారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 778 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు  మిడిల్‌‌ ఈస్ట్‌‌, జపాన్‌‌, యూరోపియన్ యూనియన్‌‌, యూఎస్‌‌ ఇన్వెస్టర్లు ఇండియాను పెట్టుబడులకు గమ్యస్థానంగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

ఎకానమీ వేగంగా వృద్ధి చెందడంలో సాయపడుతున్నారని,  ఉద్యోగాలను కల్పిస్తున్నారని వివరించారు. పెద్ద మార్కెట్ కావడంతో పాటు, స్కిల్ ఉన్న ఉద్యోగులు అందుబాటులో ఉండడంతో ఇండియా వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారని తెలిపారు. ఇండియన్ స్టాక్ మార్కెట్లు పెరిగే కొద్దీ మరిన్ని ఎఫ్‌‌ఐఐ వస్తాయని గోయెల్ అంచనా వేశారు.