నెలకు రూ.10 వేలతో 5 ఏండ్లలో రూ.13 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యుచువల్ ఫండ్..

తక్కువ పెట్టుబడితో షార్ట్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఐడియాస్ గురించి అందరూ వెతుకుతుంటారు. అలాంటి ఇన్వెస్ట్ మెంట్ అవకాశం ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్ కల్పిస్తోంది. రూ.11 లక్షల కోట్ల అసెట్ అండర్ మేనేజ్ మెంట్ తో ఇండియాలోనే అతిపెద్ద మ్యుచువల్ ఫండ్ కంపెనీలలో ఒకటైన ఎస్బీఐ మ్యుచువల్ పండ్ లో కొన్ని ఫండ్స్ తక్కువ టైమ్ లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి కాసుల పంట కురిపించాయి. 

ఎస్బీఐ మొత్తం 120 ఫండ్స్ తో రిస్క్ రిటర్న్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తూ ఇన్వెస్టర్ ఫ్రండ్లీగా ఉన్న ఈ ఫండ్స్.. తక్కువ టైమ్ లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన టాప్  ఫండ్స్, వాటి పర్ఫా్ర్మెన్స్ కింద ఇవ్వడం జరిగింది. 

1. ఎస్బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ (SBI Healthcare Opportunities Fund):

రూ.3460 కోట్ల సైజులో ఉన్న ఈ ఫండ్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 17.18 శాతం రిటర్న్స్ తో మంచి లాభాలు ఇచ్చింది. ఎస్ఐపి (SIP) రిటర్న్స్ 28.54 శాతం ఇచ్చిన ఈ ఫండ్ .. 5 ఏండ్ల క్రితం నెలకు 10 వేల రూపాయలతో ఎస్ఐపి చేస్తూ ఉంటే ఇప్పటి వరకు రూ.12.64 లక్షలు ఇచ్చింది. 

2. ఎస్బీఐ కంట్రా ఫండ్ (SBI Contra Fund):

రూ.41907 కోట్ల సైజులో ఉన్న ఈ ఫండ్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 19.62 శాతం రిటర్న్స్ తో మంచి లాభాలు ఇచ్చింది. ఎస్ఐపి (SIP) రిటర్న్స్ 30.35 శాతం ఇచ్చిన ఈ ఫండ్ .. 5 ఏండ్ల క్రితం నెలకు 10 వేల రూపాయలతో ఎస్ఐపి చేస్తూ ఉంటే ఇప్పటి వరకు రూ.13 లక్షలు రిటర్న్స్ ఇచ్చింది. 

3. ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ (SBI Technology Opportunities Fund):

రూ.33,285  కోట్ల సైజులో ఉన్న ఈ ఫండ్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 20.75 శాతం రిటర్న్స్ తో మంచి లాభాలు ఇచ్చింది. ఎస్ఐపి (SIP) రిటర్న్స్ 26.86 శాతం ఇచ్చిన ఈ ఫండ్ .. 5 ఏండ్ల క్రితం నెలకు 10 వేల రూపాయలతో ఎస్ఐపి చేస్తూ ఉంటే ఇప్పటి వరకు రూ.11.73 లక్షలు రిటర్న్స్ ఇచ్చింది. 

లిస్టులో చాలా ఫండ్స్ ఉన్నప్పటికీ బెస్ట్ పర్మాఫర్మెన్స్ ఉన్న ఫండ్స్ ను ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఫైనాన్స్ ఎనలిస్ట్ సలహా తీసుకోగలరు.