Top 10 Indian Origin CEOs: గ్లోబల్ కంపెనీల్లో.. టాప్ 10 ఇండియన్ సంతతి సీఈవోస్ ..వీళ్లే..

ఇండియన్ టాలెంట్ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది..ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీల్లో ఎక్కువగా ఆధిపత్యం, లీడింగ్ పోజిషన్ లో భారతీయులే ఉన్నారడానికి ఎలాంటి సందేహం లేదు. కొత్త కొత్త ఆవిష్కరణలు, వ్యాపార అభివృద్దిని ప్రభావితం చేయడంలో మనోళ్లు ముందున్నారు. ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇండియన్లు వారికివారేసాటి.తమ టాలెంట్ ని ప్రపంచవ్యాప్తంగా పంచుతున్నారు.. ప్రముఖ ఇండియన్ ఆరిజన్స్ ప్రపంచ టాప్ కంపెనీలను సక్సెస్ ఫుల్ రన్ చేయడంతో ముందున్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల్లో సత్తా చాటుతున్న టాప్ 10 ఇండియన్ సంతతి ప్రముఖ సీఈవో(CEO) లను గురించి తెలుసుకుందాం..  

టాప్ 10 ఇండియన్ సంతతి సీఈవోస్..

సుందర్ పిచాయ్ (గూగుల్) 

ప్రపంచ టాప్ కంపెనీల్లో ఒకటైన గూగుల్ సంస్థకు సీఈవోగా భారతీయ సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ఉన్నారు. ఐఐటీ కరఘ్ పూర్ లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదివిన సుందర్ పిచాయ్.. వార్టన్ లో ఎంబీఏ చేశారు. 2015లో గూగుల్ సీఈవోగా పిచాయ్ బాధ్యతలు చేపట్టారు..2019 ఆల్ఫాబెట్ కు సీఈవో అయ్యాడు. అప్పటినుంచి గూగుల్ సంస్థను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తు్న్నారు.

సత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్) 

ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కు సత్యనాదెళ్ల ఓ ఇండియన్.. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన సత్యనాదెళ్ల.. యూనివర్సిటి ఆఫ్ చికాగోలో ఎంబీఏ చేశారు. 2014 ఫిబ్రవరి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్నారు. 

నీల్ మోహన్ (యూట్యూబ్) 

నీల్ మోహన్ కూడా ఇండియన్ సంతతికి చెందిన వ్యక్తి.. స్టాండ్ ఫోర్డ్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నారు. స్టాన్ ఫోర్డ్ GSBలో ఎంబీఏ చేశారు.2023 ఫిబ్రవరిలో యూట్యూబ్ సీఈవోగా నియమితులయ్యారు. 

శాంతన్ నారాయేణ్( అడోబ్ ) 

ప్రపంచ టాప్ కంపెనీల్లో మరొకటి అడోబ్(Adobe).. ఈ కంపెనీకి కూడా మన భారతీయుడే సీఈవో.. 2007 డిసెంబర్ నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా అడోబ్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. శాంతన్ నారాయేణ్.. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. యూపీ బార్కెలీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 

అజయ్ బంగా ( వరల్డ్ బ్యాంక్ గ్రూప్)   

వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న అజయ్ బంగా కూడా ఇండియన్ ఆరిజన్.. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ఢిల్లీ నుంచి ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు అజయ్ బంగా. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి  మేనేజ్ మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొందారు. 2023 జూన్ నుంచి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 

అరవింద్ కృష్ణ( IBM)

IBM సీఈవో అరవింద్ కృష్ణ కూడా ఓ ఇండియన్. ఐఐటీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 2020 ఏప్రిల్ నుంచి IBM సీఈవోగా కొనసాగుతున్నారు. 

వివేక్ శంకరన్ (అల్బర్ట్ సన్ ) 

ప్రపంచ ప్రముఖ కంపెనీల్లో ఒకటైన అల్బర్ట్ సన్ సీఈవో కూడా మన ఇండియనే.. వివేక్ శంకరన్.. ఐఐటీ చెన్నై నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందారు. 2019 ఏప్రిల్ నుంచి అల్బర్ట్ సన్ కంపెనీ సీఈవోగా కొనసాగుతున్నారు.  

సలీల్ పర్కేష్( ఇన్ఫోసిస్) 

ప్రపంచ టాప్ టెన్ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సీఈవో కూడా భారతీయుడే..సలీల్ పర్కేష్.. ఐఐటీ బాంబే నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 2018 జనవరి నుంచి ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగుతున్నారు. 

నికేష్ అరోరా(Palo Alto Networks ) 

  Palo Alto Networks సీఈవో నికేష్ అరోరా ఓ ఇండియన్.. ఐఐటీ వారణాసి నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 2018 జూన్ నుంచి Palo Alto Networks సీఈవోగా ఉన్నారు. 

జయశ్రీ ఉల్లాల్(Arista Networks) 

జయశ్రీ ఉల్లాల్ .. భారతీయ సంతతికిచెందిన మహిళ. ఈమె శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. 2008 నుంచి ఈమె Arista Networks కు సీఈవోగా కొనసాగుతున్నారు.