ఇవాళ విద్యుత్​ సరఫరాలో అంతరాయం

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: మండల పరిధిలోని గుమ్మడిదల, నల్లవల్లి, కానుకుంట గ్రామల్లో విద్యుత్​ సరఫరాలో అంతరాయం కలగనుందని విద్యుత్​ శాఖ ఏడీ శ్రీకాంత్​ బుధవారం తెలిపారు. గుమ్మడిదల పరిధిలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ లైన్ లో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్​ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.