జోడేఘాట్ ఫారెస్ట్​లో పెద్దపులి సంచారం

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ అడవుల్లో పెద్దపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్లు సూచించారు. జోడేఘాట్ రేంజ్ పరిధిలో పులి పాదముద్రలను గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలో దిగిన ఆఫీసర్లు.. పాదముద్రలను గుర్తించి పులిగా నిర్ధారించారు. డీఎఫ్ వో నీరజ్ కుమార్ టిబ్రెవాల్ జోడేఘట్ అడవుల్లో పర్యటించి పులి ఆనవాళ్లు, జాడ కోసం చేపడుతున్న గాలింపును పర్యవేక్షించారు.

ఈ పులి మహారాష్ట్ర నుంచి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పులికి సంబంధించి ఎలాంటి సమాచారమున్నా ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియజేయాలని, ఎలాంటి హానీ తలపెట్టివద్దని సూచించారు. పులి దాడిలో పశువులు చనిపోతే వెంటనే పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు.