ఆసిఫాబాద్ శివారులో పులి సంచారం .. పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్లు

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారం కలకలం రేపింది. కౌటగూడ, గంటలగుడా, ఆడ దస్నాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామాల సమీపంలో మంగళవారం సాయంత్రం పులి కనిపించిందని ప్రచారం జరిగింది. దీంతో ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌వో గోవింద్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ సర్దార్‌‌‌‌‌‌‌‌, ఎఫ్‌‌‌‌‌‌‌‌బీవోలు ప్రభాకర్, రామ్మూర్తి బుధవారం తెల్లవారుజామున గ్రామాలకు వెళ్లి పులి కదలికలపై ఆరా తీశారు.

 వివిధ ప్రాంతాల్లో తిరిగి పులి పాదముద్రలను గుర్తించారు. మహారాష్ట్ర నుంచి వాంకిడి మండలంలో ఇందాని, కెరమెరి మండలంలోని నిషాని మీదుగా ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ పరిసరాల్లోకి చేరుకొని ఆడ దస్నాపూర్‌‌‌‌‌‌‌‌ మీదుగా జోడేఘాట్‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్లిందని ఆఫీసర్లు చెబుతున్నారు. పులి సంచారంతో ఆసిఫాబాద్ మండల ప్రజలు భయాందోలనకు గురవుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆఫీసర్లు సూచించారు.