నిర్మల్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో ఆదివారం రాత్రి పెద్దపులి సంచారం కలకలం రేపింది. సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ పై సంచరిస్తూ పెద్దపులి రోడ్డు దాటుతుండగా ప్రయాణీకులు చూశారు. అటుగా వెళుతున్న యువకులకు పెద్దపులి గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి రోడ్డు దాటుతున్న దృశ్యాలను యువకులు వీడియో తీశారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు ఘటనస్థలికి చేరుకుని.. ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలను నిర్మల్ వైపు మళ్లించారు. ఫారెస్ట్ అధికారులు బైపాస్ రోడ్డు గుండా వాహనాలు వెళ్లాలని పెద్దపులి సంచరిస్తున్న రోడ్డు మార్గం గుండా రాకపోకలను డైవర్ట్ చేశారు.