ఆదిలాబాద్లో పెద్దపులి..భయాందోళనలో ప్రజలు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం వజ్జర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది.  ఆ గ్రామం వైపు వెళ్తున్న గ్రామస్తులు పెద్దపులిని చూడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

వజ్జర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.  దీంతో ఫారెస్ట్ అధికారులు గ్రామ ప్రజలకు అటువైపు వెళ్ళొద్దని  సూచనలు చేస్తున్నారు.