దానాపూర్‌‌లో మేకలపై పులి దాడి

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్‌‌ మండలంలోని దానాపూర్‌‌ సమీపంలో ఓ మేకల మందపై ఆదివారం పులి దాడి చేసింది. పులిరాకను గమనించిన కాపరి గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు, ఫారెస్ట్‌‌ ఆఫీసర్లకు విషయం చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత వారు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించగా రెండు మేకలు చనిపోగా, మరో మేక గాయపడింది. 

ఆసిఫాబాద్‌‌ రేంజ్ అధికారి గోవింద్ సింగ్ సర్దార్, డిప్యూటీ రేంజ్ అధికారి యోగేశ్, బీట్ ఆఫీసర్లు రాజేశ్, సాదిఖ్‌‌, వెంకటేశ్​అక్కడికి చేరుకొని దాడి చేసింది పులేనా ? లేక చిరుతనా ? అని తెలుసుకునే పనిలో పడ్డారు. పరిసర ప్రాంతాల్లో పాదముద్రలు కోసం గాలిస్తున్నారు.

చిరుత దాడిలో ఆవు మృతి

బజార్ హత్నూర్, వెలుగు : బజార్‌‌ హత్నూర్ మండలంలోని బుర్కపల్లి అటవీ ప్రాంతంలో ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. బుర్కపల్లి గ్రామంలోని రవికి చెందిన ఆవు మేత కోసం అడవిలోకి వెళ్లింది. శనివారం రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో ఆదివారం ఉదయం రవి అడవిలో గాలించగా ఆవు కళేబరం కనిపించింది. ఆవును చిరుత చంపి ఉంటుందని ఎఫ్‌‌ఆర్‌‌వో తెలిపారు.