యువకుడి హత్య కేసులో ముగ్గురు మైనర్లు అరెస్ట్

నిర్మల్, వెలుగు : సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ విషయంలో జరిగిన ఓ గొడవ యువకుడి ప్రాణం తీసింది. యువకుడిని హత్య చేసి, డెడ్‌‌‌‌బాడీని కాల్చి వేసిన ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను నిర్మల్‌‌‌‌ ఎస్పీ జానకీ షర్మిల ఆదివారం వెల్లడించారు. జూన్‌‌‌‌  1న బాసర పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో పరిధిలో ఓ గుర్తు తెలియని డెడ్‌‌‌‌బాడీని పోలీసులు గుర్తించారు. హత్య కేసుగా నమోదు చేసి భైంసా ఏఎస్పీ, ముథోల్ సీఐ, బాసర ఎస్సై ఆధ్వర్యంలో ఎంక్వైరీ స్టార్ట్‌‌‌‌ చేశారు. చనిపోయిన వ్యక్తి ఫకీరాబాద్‌‌‌‌కి చెందిన అర్జున్‌‌‌‌గా గుర్తించారు. 

సాంకేతిక ఆధారాల ఆధారంగా విచారణ చేసిన పోలీసులు బాసర, సక్రోలికి ముగ్గురు మైనర్లు ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. ఆదివారం బాసర రైల్వే స్టేషన్‌‌‌‌ సమీపంలో తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ విషయంలో జరిగిన గొడవ కారణంగా ముగ్గురు మైనర్లు బండరాయితో మోది యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల వద్ద నుంచి బైక్‌‌‌‌, రెండు సెల్‌‌‌‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న ఏఎస్పీ అవినాశ్‌‌‌‌కుమార్‌‌‌‌, ముథోల్‌‌‌‌ సీఐ మల్లేశ్‌‌‌‌, బాసర ఎస్సై గణేశ్‌‌‌‌తో పాటు పోలీస్‌‌‌‌ సిబ్బందిని రామకృష్ణ, శ్రీనివాస్, నరేందర్, కిరణ్, రాజేశ్వర్‌‌‌‌ను ఎస్పీ అభినందించారు.