ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీలో చేరారు. 6, 20, 40 వార్డు కౌన్సిలర్లు నెమలికొండ విషు, సంజయ్, భరత్ కుమార్కు ఎమ్మెల్యే తన క్యాంప్ ఆఫీస్లో కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై పెరిగిన నమ్మకం, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీజేపీలో చేరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు లాలామున్నా, నాయకులు రఘుపతి, కృష్ణ యాదవ్, ఆకుల ప్రవీణ్ తదితరులున్నారు.
విద్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాయని పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ బాలికల ఆశ్రమ పాఠశా లలో రూ. 75 లక్షలతో నిర్మించనున్న వసతి భవనానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థు లకు మంచి చదువు అందించడంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఆరు నెలల్లో రూ. 75 లక్షలతో పక్కా బిల్డింగ్ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు.