న్యూఢిల్లీ: ఈ ఏడాది సిమెంట్ ఇండస్ట్రీలో రెండు కార్పొరేట్ గ్రూప్‌ల మధ్య హోరాహోరీ పోటి నెలకొంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్స్ ఈ ఏడాది చాలా చిన్న కంపెనీలను తమలో కలిపేసుకున్నాయి. ఈ రెండు కార్పొరేట్ కంపెనీలు 4.5 బిలియన్ డాలర్ల (రూ.38,250 కోట్ల) విలువైన 50 మిలియన్ టన్స్ పర్ యానమ్ (ఎంటీపీఏ) కెపాసిటీని కొనుగోలు చేశాయి. వీటితో పాటు తమ ప్లాంట్లను విస్తరించేందుకు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాయి. అంబుజా సిమెంట్స్ సంఘీ, పెన్నా ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేయగా, ఇండియా సిమెంట్స్‌ను అల్ట్రాటెక్ కొనుగోలు చేసింది.