ఈసారి జీడీపీ గ్రోత్ 6.5 శాతం.. ఈవై రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రస్తుత, రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో మనదేశ జీడీపీ వృద్ధి 6.5 శాతం ఉండొచ్చని ఎర్నెస్ట్​ అండ్​ యంగ్​(ఈవై) రిపోర్టు పేర్కొంది. ప్రైవేట్​ వినిమయ ఖర్చు తగ్గడం వల్ల సెప్టెంబరు క్వార్టర్​లో జీడీపీ వృద్ధి నెమ్మదించిందని పేర్కొంది.  రియల్​ జీడీపీ వృద్ధి ఏడు క్వార్టర్ల కనిష్టం 5.4 శాతంగా నమోదయింది. దీనికి ముందు క్వార్టర్​లో 6.7 శాతం ఉంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో ప్రభుత్వ పెట్టుబడి వినిమయ వృద్ధి ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–15.4 శాతంగా ఉంది. గత అక్టోబరులోనూ ఇది –8.4 శాతంగా నమోదయింది.   ఆర్థిక వ్యవస్థలోని వివిధ ఆస్తుల మధ్య వ్యాపారం లేదా మార్పిడి ఎంత త్వరగా జరుగుతుందో పెట్టుబడి వినిమయ వృద్ధి సూచిస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థ  సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.